![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -645 లో....దీప జరిగింది గుర్తుచేసుకుంటూ పరధ్యానంలో ఉంటుంది. అప్పడే కార్తీక్ వస్తాడు. ఏంటి ఇంకా జ్యోత్స్న అన్నమాటలు గుర్తుచేసుకుంటున్నావా అని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న అన్న దాంట్లో నిజం ఉంది.. కార్తీక్ భార్యగా కాకుండా ఒక ఆడదానిలాగా ఆలోచిస్తే జ్యోత్స్న మాట్లాడిన దాంట్లో నిజం ఉందని దీప అంటాడు. ఏంటి దీప దారిలో వచ్చేటప్పుడు ఏమైనా గాలి సోకిందా ఏంటని కార్తీక్ అంటాడు. లేదు బావ జ్యోత్స్నకి చిన్నప్పటి నుండి నువ్వు బావ అని కాకుండా తనే నీ భర్త అని చెప్పారు. ఇందులో జ్యోత్స్న తప్పేముంది అంత పెద్దవాళ్లదే తప్పు అని దీప అంటుంది.
ఇప్పటికి జ్యోత్స్న నిన్ను ప్రేమిస్తుందని దీప అనగానే కొంపదీసి త్యాగాలు.. ఏం ప్లాన్ చెయ్యడం లేదు కదా అని కార్తీక్ అంటాడు. లేదు బావ.. అయినా ఇదంతా ఆ పారిజాతం గారి వల్లే.. తనకి బుద్ధి చెప్పకుండా ఇలా చేసిందని దీప అనగానే ఒక నిమిషం ఉండు అని పారిజాతానికి కార్తీక్ ఫోన్ చేస్తాడు. మీ మనవరాలు జ్యోత్స్న నా భార్యకి నిద్రలేకుండా చేసిందని కార్తీక్ యాక్టింగ్ చేస్తాడు. ఏం అందిరా నా దీపమ్మని అని పారిజాతం అడుగుతుంది. జ్యోత్స్న నా భార్య మనసు మీద కొట్టింది.. తను ఒక అనాథ కదా.. తనకి అమ్మా, నానమ్మ ఉంటే ఇలా చేసేవాళ్ళా అని కార్తీక్ అంటాడు. నువ్వు అలా మాట్లాడకురా కార్తీక్.. దీపని పడుకోమని చెప్పని పారిజాతం అంటుంది. నువ్వే కదా పారిజాతం వల్లనే అన్నావ్.. ఇప్పుడు పారునే జ్యోత్స్నని సరిచేస్తుంది.. పారు నువ్వే తన మనవరాలు అనుకుంటుందని దీపతో కార్తీక్ అంటాడు. మరొకవైపు జ్యోత్స్న బెడ్ పై పడుకుంటుంది. అప్పుడే తన పక్కన పారిజాతం వచ్చి పడుకుంటుంది. తనని నిద్రపోకుండా చేస్తుంది.
ఆ తర్వాత జ్యోత్స్న మెడలో కార్తీక్ తాళి కట్టినట్లు కాంచనకి కల వస్తుంది. ఒక్కసారిగా ఉలిక్కి పడి నిద్రలేస్తుంది. దాంతో శౌర్య వాటర్ గ్లాస్ లో ఇస్తుంది. గ్లాస్ కూడా టెన్షన్ కి కింద పడేస్తుంది. మరుసటిరోజు ఉదయం శ్రీధర్ ని రప్పించి కాంచన తనకి వచ్చిన కల గురించి చెప్తుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. మీ అమ్మకి జ్యోత్స్నని పెళ్లి చేసుకున్నట్లు కల వచ్చిందట అని అనగానే అవన్నీ నమ్మొద్దని కార్తీక్ అంటాడు. ఏమో మీలాగా వాడికి రెండు పెళ్లిళ్లు అవుతాయేమోనని కాంచన అంటుంది. ఆ డిస్కషన్ మొత్తం దీప విని ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |